Skip to main content

telanganagonthuka

Blog Post

telanganagonthuka > News > district News > హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు…

డబ్బులు డిమాండ్​ చేసిన వారిపై ఏసీబి, హైడ్రా, పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయాలంటున్న హైడ్రా

తెలంగాణ గొంతుక:
హైడ్రా పేరుతో ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. ఎవరైన హైడ్రా పేరుతో డబ్బులు డిమాండ్​ చేస్తే వారిపై హైడ్రా అధికారులు, ఏసీబి అధికారులు, స్థానిక పోలీస్​ స్టేషన్​లలో ఫిర్యాదు చేయాలని హైడ్రా అధికారులు శుక్రవారం ఒక ప్రకటణలో తెలిపారు.

అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిని కొంత మంది హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయని, ఎవరైన హైడ్రా పేరుతో బెదిరించితే వెంట‌నే ఫిర్యాదు చేయాల‌ని కోరారు. అక్ర‌మ క‌ట్ట‌డాలు, అనుమ‌తి లేని నిర్మాణాల‌పై హైడ్రా ఇప్పటి వరకు ఎక్క‌డా నేరుగా చ‌ర్య‌లు తీసుకోలేద‌ని స్ప‌ష్టం చేసింది. గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పోరేషన్ (జీహెచ్‌ ఎంసీ)​, సైబరాబాద్​ మున్సిపల్​ కార్పోరేషన్​ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్​ కార్పోరేషన్​ (ఎంఎంసీ)ల విజ్ఞ‌ప్తి మేర‌కు ప్ర‌మాద‌క‌ర‌ంగా మారిన భ‌వ‌నాల‌ను మాత్రమే హైడ్రా ఆధ్వర్యంలో తొల‌గించడం జరిగిందని తెలిపారు. హైడ్రా పేరుతో బెదిరింపుల‌కు పాల్ప‌డ‌డం, ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టి డ‌బ్బులు గుంజిన‌ట్టు సామాజిక మాధ్య‌మాల్లో వ‌స్తున్న వార్త‌లు, త‌మ‌కు నేరుగా వ‌చ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో హైడ్రా ఈ ప్ర‌క‌ట‌న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. కూలిపోయే స్థితిలో ఉండి, ప్ర‌జ‌ల‌ ప్రాణాల‌కు ముప్పుగా ఉండే భ‌వ‌నాల‌పై హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటుందని తెలిపారు. అక్రమ నిర్మాణాలు, ప్రమాదకరంగా ఉన్న భ‌వ‌నాలలో హాస్ట‌ళ్లు నిర్వ‌హించ‌రాద‌ని, సుర‌క్షిత‌మైన భ‌వ‌నాలలోకి హాస్ట‌ళ్లు మార్చాల‌ని ఇప్ప‌టికే హైడ్రా సూచనలు ఇచ్చిందని అన్నారు. ఇందుకుగాను డిసెంబ‌రు 31వ తేదీ వ‌ర‌కూ గ‌డువు ఇచ్చిన విష‌యాన్ని హైడ్రా అధికారులు తెలిపారు. హైడ్రా పేరు చెప్పి డ‌బ్బులు దండుకునే వారిపై నేరుగా హైడ్రా, ఏసీబీ కార్యాల‌యాల్లో ఫిర్యాదు చేయాల‌ని సూచించింది. అలాగే స్థానిక పోలీసు స్టేష‌న్లో కూడా ఫిర్యాదు చేయాల‌ని పేర్కొంది. హైడ్రా పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే వారు చెప్పిన మాటలు నమ్మి ఎలాంటి చెల్లింపులు చేయ‌వ‌ద్ద‌ని సూచించింది.

ఫిర్యాదు చేయాల్సిన నంబ‌ర్లు:

  • ఏసీబీ టోల్‌ఫ్రీ నంబ‌రు : 1064
  • హైడ్రా కంట్రోల్ రూం టోల్‌ఫ్రీ నంబ‌రు : 1070

Leave a comment

Your email address will not be published. Required fields are marked *