Skip to main content

telanganagonthuka

Blog Post

telanganagonthuka > News > district News > కూకట్​పల్లిలో కన్నుల విందుగా సద్దుల బతుకమ్మ

కూకట్​పల్లిలో కన్నుల విందుగా సద్దుల బతుకమ్మ

కన్నుల విందుగా సద్దుల బతుకమ్మ
కూకట్​పల్లిలో భారి బతుకమ్మల ఊరేగింపు…

కూకట్​పల్లిలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు.
ఐడిఎల్​ చెరువు కట్టపై బతుకమ్మ ఆడుతున్న మహిళలు.

 

 

 

 

 

 

 

తెలంగాణ గొంతుక:
కూకట్​పల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సద్దుల బతుకమ్మ నాడు కూకట్​పల్లి గ్రామంలో భారి బతుకమ్మలను పేర్చి గ్రామ పురవీధులలో ఊరేగించి రంగధాముని చెరువు కట్టకు నిమజ్జనానికి తరలించారు. కూకట్​పల్లి గ్రామంలోని హనుమాన్​ ఆలయం వద్బ ఉన్న బతుకమ్మ మైదానంలో బతుకమ్మ అడిన తరువాత భారి బతుకమ్మలను గ్రామ పురవీధులలో ఊరేగించారు. 5 అడుగుల నుంచి 20 అడుగుల వరకు బతుకమ్మలను తయారు చేయడం కూకట్​పల్లి గ్రామంలో ఎన్నో దశాబ్దాలుగా ఆనవాయితిగా వస్తున్న పద్దతి. రంగధాముని చెరువు కట్టపై బతుకమ్మ, విజయ దశమి నిర్వహణ కమిటి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిలలు పాల్గొన్నారు.

ఎమ్మెల్సి కుర్మయ్యగారి నవీన్​ కుమార్​ కుటుంబం
భారి బతుకమ్మతో మహిళలు
బీజేపీ నాయకుడు వడ్డెపల్లి రాజేశ్వర్​ రావు కుటుంబం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *