Skip to main content

telanganagonthuka

Blog Post

telanganagonthuka > News > district News > బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
Make elaborate and well-organized arrangements for the Bathukamma celebrations: MLA Madhavaram Krishna Rao

బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి:

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

తెలంగాణ గొంతుక:
బతుకమ్మ వేడుకలకు పకడ్బంది ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా శుక్రవారం రంగధాముని చెరువు కట్టపై బతుకమ్మ వేడుకల ఏర్పట్లను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బతుకమ్మ పండుగను మహిళలు, ఆడపడుచులు పెద్ద ఎత్తున పాల్గొని అంగరంగ వైభవంగా జరుపుకుంటారని, వేడుకలలో పాల్గొనే మహిళలకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బతుకమ్మ వేడుకలకు వచ్చే ప్రజలకు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలు సమృద్ధిగా కల్పించాలని సూచించారు. అదేవిధంగా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సంబంధిత శాఖల అధికారులు నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపు కోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఈ స్రవంతి, ఏఈ శ్రావణి, మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు, డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, వెంకటేష్ వివిధ శాఖలకు చెందిన అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

పనులను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *