Skip to main content

telanganagonthuka

Blog Post

telanganagonthuka > News > district News > గంభీరావుపేటలో ఘనంగా సద్దుల బతుకమ్మ

గంభీరావుపేటలో ఘనంగా సద్దుల బతుకమ్మ

గంభీరావుపేటలో ఘనంగా సద్దుల బతుకమ్మ

బతుకమ్మ ఆటలతో ఆడి పాడిన మహిళలు… కోలాహాలంగా సద్దుల బతుకమ్మ సంబురాలు…

తెలంగాణ గొంతుక, (రాజన్న సిరిసిల్లా):
రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు…
సంప్రదాయ వస్త్రధారణలో మహిళల సందడి..
ఆటపాటలతో గంభీరావుపేటలో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి…
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఉత్సాహంగా జరుపుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఆదివారం సద్దుల బతుకమ్మ సంబురలు ఘనంగా నిర్వహించుకున్నారు. సద్దుల బతుకమ్మ వేళ మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి తంగేడు, గునుగు, బంతి, చామంతి తీరొక్క పూలతో పేర్చిన అందమైన బతుకమ్మలతో గౌరమ్మకు పూజలు చేసి బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ కోలాటం ఆడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో చివరి రోజైన సద్దుల బతుకమ్మకు ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ సందర్భంగా మహిళలు ఒకరికొకరు సద్దులు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *