Skip to main content

telanganagonthuka

Blog Post

telanganagonthuka > News > district News > ప్రభుత్వ పాఠశాలకు చేయూతను అందించాలి: పవన్​ కుమార్​ నర్వ

ప్రభుత్వ పాఠశాలకు చేయూతను అందించాలి: పవన్​ కుమార్​ నర్వ

ప్రభుత్వ పాఠశాలకు చేయూతను అందించాలి: బీజేపీ ఐటి సెల్​ కన్వీనర్​ పవన్​ కుమార్​ నర్వ

తెలంగాణ గొంతుక:
ప్రభుత్వ పాఠశాలకు ప్రతి ఒక్కరు చేయూతను అందించాలని బీజేపీ మేడ్చల్​ అర్బన్​ జిల్లా ఐటి సెల్​ కన్వీనర్​ పవన్​ కుమార్​ నర్వ అన్నారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీకి ఆదర్శమైన సేవా హీ సంఘటన్​, జాతీ ప్రథమం అన్న స్పూర్తితో కేపీహెచ్​బీకాలనీ భువన విజయంలోని ప్రభుత్వ పాఠశాల కాంట్రాక్ట్​ ఉపాధ్యాయురాలి వేతనానికి తన వంతుగా ఆర్థిక సహయం అందించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలకు తమ వంతు చేయూతను అందించాలని కోరారు. ప్రధాన మంత్రి మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగ నరేంద్ర మోదీ స్పూర్తితో విద్యా రంగానికి తన వంతు సహాయ సహకారాన్ని అందించడం జరిగుతుందని, గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలికి వేతనాన్ని అందిస్తున్నానని తెలిపారు. అట్టడుగు స్థాయి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకే తన వంతు చేయూతను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వికసిత భారత్-2047 లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ సమాజ సేవకు కట్టుబడాలని పవన్​ కుమార్ నర్వ పిలుపు నిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *