Skip to main content

telanganagonthuka

Blog Post

telanganagonthuka > News > district News > మహిళలు పిల్లలు కనేందుకే పనికోస్తారు…. మహిళల పట్ల హేళనగా మాట్లాడిన జేఎన్​టీయూహెచ్​ వీసీ కిషన్​ కుమార్​ రెడ్డి.

మహిళలు పిల్లలు కనేందుకే పనికోస్తారు…. మహిళల పట్ల హేళనగా మాట్లాడిన జేఎన్​టీయూహెచ్​ వీసీ కిషన్​ కుమార్​ రెడ్డి.

మహిళలు పిల్లలు కనేందుకే పనికోస్తారు….

మహిళల పట్ల హేళనగా మాట్లాడిన జేఎన్​టీయూహెచ్​ వీసీ కిషన్​ కుమార్​ రెడ్డి.

ప్రైవేటు కళాశాల అధ్యాపకులను దుర్భాషలాడిన జేఎన్​టీయూహెచ్​ వీసీ కిషన్​కుమార్​ రెడ్డి…

జేఎన్​టీయూహెచ్​ వీసీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విజేఐటి ప్రిన్సిపల్​ ఏ. సృజన, అధ్యాపకురాలు డి. అరుణ కుమారి.

మహిళలు ఎందుక పనికిరారు, పిల్లలను కని, వారిని పోషించాలి, వంట గదిని చూసుకోవాలి ఇదేవరో దారిన పోయే దానయ్య అన్నది కాదు. ఏకంగా ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిన జేఎన్​టీయూహెచ్​ వీసీ టి. కిషన్​ కుమార్​ రెడ్డి. తమ కళాశాలలో ఈ నెల 30వ తేదిన జరగనున్న ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని వచ్చిన విజేఐటి ప్రిన్సిపాల్​ సృజన, అధ్యాపకురాలు అరుణ కుమారితో వీసీ టి. కిషన్​ కుమార్​ రెడ్డి మాట్లాడారని, మహిళలను కించ పరుస్తు, తమను హేళన చేసి కొట్టేంత పని చేశారని ఆరోపిస్తు విజేఐటి ప్రిన్సిపాల్​ సృజన, అధ్యాపకురాలు అరుణ కుమారిలు బుధవారం కేపీహెచ్​బీ పోలీసులకు నాలుగు పేజీల ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి జేఎన్​టీయూహెచ్​ వీసీ టి. కిషన్​ కుమార్​ రెడ్డిని కలిసేందుకు విజేఐటి ప్రిన్సిపాల్​ ఏ. సృజన, డిపార్ట్​మెంట్​ ఆఫ్​ కంప్యూటర్​ సైన్సెస్​ అధ్యాపకురాలు డి. అరుణ కుమారిలు మంగళవారం వీసీ చాంబర్​కు వెళ్లారు. ఈ నెల అక్టోబర్​ 30వ తేదిన తమ కళాశాలలో ఏడబ్ల్యూఎస్​ స్టూడెంట్​ కమ్యూనిటి డే హైదరాబాద్​ 2026 పేరుతో చేపడుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని విజ్ఞప్తి చేసేందుకు వెళ్లారు. వీసీ కలిసినప్పటి నుంచి తమను కనీసం కూర్చోవడానికి సీటు ఇవ్వలేదని, పెద్ద పెద్దగా కేకలు వేస్తు మీ కళాశాలలో ఎటువంటి కార్యక్రమానికి రానంటు చిందులేశారని తెలిపారు. మీరు విజేఐటి సర్వెంట్​లు మాత్రమే మీకు చేర్​ ఇవ్వలేమంటు దుర్భాషలాడారని ఆరోపించారు.గతంలో విజేఐటీలో పని చేసిన రెండు రోజుల పాటు ప్రిన్సిపాల్​గా పని చేసిన సమయంలో మహిళా ఉద్యోగులందరని తొలగించాలని అనుకున్నానని చెప్పారని, మహిళలు దేనికీ పనికిరారని, సంస్థ అభివృద్ధిని అడ్డుకోవడం తప్ప మరేమీ చేయరని తమ పట్ల అవమానకర వ్యాఖ్యాలు చేశారని ఆరోపించారు. అదే విధంగా తనను కార్యక్రమానికి ఆహ్వానించడానికి మహిళలు అసలు సంప్రదించకూడదని, మహిళలకు విద్యా, వృత్తి పరమైన రంగాలలో స్థానం లేదని, వారు ఇళ్లకే పరిమితమై పిల్లలను కనడం, వారి సంరక్షణ చేయడమే చేయాలని తీవ్ర పదజాలంతో మాట్లాడారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము అందించిన ఆహ్వాన పత్రాన్ని తమ ముందే చింపి చెత్త బుట్టలో పడేసి, తమను ఉద్దేశించి, మీరు ఈ సంస్థకు కేవలం సర్వెంట్లు మాత్రమే చెత్త బుట్టలో ఉన్న చెత్తకంటే కూడా మీ పరిస్థితి అధ్వాన్నం, మీరు చెత్త బుట్ట దగ్గరే నిలబడాలి అంటు మాట్లాడారని ఆరోపించారు.

 

అదే సమావేశంలో అనురాగ్ యూనివర్సిటీ సీఈఓ నీలిమ గురించి సైతం అవమానకరమైన, అభ్యంతరకరమైన పదాలతో ప్రస్తావించారని సృజన, అరుణ కుమారిలు తెలిపారు. నీలిమా ఒక గయ్యాళి అంటు సంబోధించారని, ఫ్యాకల్టీ సభ్యులందరూ ఆమె చెప్పినట్లే నడుచుకోవాల్సి వస్తుందని వ్యంగ్యంగా, అవమానకరంగా వ్యాఖ్యానించారని ఆరోపించారు. నీలిమను ఉద్దేశిస్తూ ఎన్​ఈపి అంటే నేషనల్​ ఎడ్యుకేషన్​ పాలసి కాదు నీలిమ ఎడ్యుకేషన్​ పాలసి అని వ్యంగ్యంగా మాట్లాడారని అన్నారు. అంతే కాకుండా వీజేఐటి కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే అయి ఉండవచ్చు, గతంలో ఏఐసీటిఈ అనుమతులు, అనుబంధ గుర్తింపులకు సంబంధించిన విషయాలలో తన చుట్టు అనేకసార్లు తిరిగాడని, తన సహాయా, సహకారాలు పొందాడని వీసీ చెప్పినట్టు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమతో మాట్లాడే సమయంలో వీసీ కిషన్​ కుమార్​ రెడ్డి అసభ్యకరమైన పదాలను వినియోగించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. జేఎన్​టీయూహెచ్​ వీసీ కిషన్​ కుమార్​ రెడ్డి లింగ వివక్షతో పాటు మహిళలను కించ పరుస్తు, వంటింటికే పరిమితం, పిల్లలను కని పోషించుకోవాలని మాట్లాడటం తమ ఆత్మగౌరవానికి విఘాతం కలిగించిందని ప్రిన్సిపాల్​ ఏ. సృజన, అధ్యాపకురాలు డి. అరుణ కుమారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *