Skip to main content

telanganagonthuka

Blog Post

telanganagonthuka > News > district News > మిని ట్యాంక్​ బండ్​పై ఏర్పాట్లు ఏవి…?

మిని ట్యాంక్​ బండ్​పై ఏర్పాట్లు ఏవి…?

మిని ట్యాంక్​ బండ్​పై ఏర్పాట్లు ఏవి…?
బోసి పోతున్న బతుకమ్మ విగ్రహం…
విద్యుత్​ దీపాలు లేక వెల వెల పోతున్న మిని ట్యాంక్​ బండ్​…
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మకు అవమానం…
విజయ దశమి వేళ అంద విహీనంగా దర్శనమిస్తున్న కేసరి సముద్రం చెరువు కట్ట…
కనీసం విద్యుత్​ దీపాలు ఏర్పాటు చేయని పాలకులు, మున్సిపల్​ అధికారులు…

తెలంగాణ గొంతుక:
నాగర్​ కర్నూల్​ మినిట్యాంక్​ బండ్​… విజయ దశమి, బతుకమ్మ వేడుకలు వస్తే రంగు రంగుల విద్యుత్​ కాంతులతో, అందమైన తోరణాలతో అందరిని ఆకట్టుకునే విధంగా ముస్తాబు అయ్యే మిని ట్యాంక్​ బండ్​ నేడు బోసి పోతుంది. బతుకమ్మ పండుగ ప్రారంభం నాటి నుంచే గతంలో చెరువు కట్టను అందంగా అలంకరించే వారు. నేడు పాలకులు, పురపాలక శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా మిని ట్యాంక్​ బండ్​ పై పండుగ వాతావరణం కానొస్త లేదు. ట్యాంక్​ బండ్​ అంతా చిమ్మ చీకటితో అంద విహీనంగా దర్శనమిస్తుంది.

మిని ట్యాంక్​ బండ్​

 

బోసి పోతున్న బతుకమ్మ విగ్రహం

దసరా సెవలువు, దేవి శరన్నవరాత్రి వేడుకలు:
దసరా సెలవులు వస్తే చాలు విద్యా కోసం, ఉపాధి కోసం పొరుగు ఊర్లకు వెళ్లిన వారు, సొంత ఊరిని వదిలి దూర ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారు, నాన్నమ్మలు, అమ్మమ్మల ఇంటికి వచ్చే వారితో ప్రతి ఊరు కలకలలాడుతు ఉంటుంది. ఈ క్రమంలో గతంలో ప్రతి విజయ దశమికి నాగర్​కర్నూల్​ కేసరి సముద్రం కట్ట నేటి MIini Tank Bund ఎంతో ముస్తాబు అయ్యేది. దేవి శరన్నవరాత్రులు ప్రారంభం అయి నాలుగు రోజులు గడుస్తున్న ఇప్పటికి పాలకులు, అధికారులలో చలనం రావడం లేదు. చెరువు కట్టను కనీసం ముస్తాబు చేయడం అటు పెడితే ఉన్న విద్యుత్​ దీపాలను అయిన మరమ్మత్తు చేయించి ప్రజలకు అహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

 

రంగులు పూస్తున్న కార్మికులు

ఇంకా రంగులు పూస్తున్నారు:
విజయ దశమని వేడుకలు, దసరా సెలవులు ప్రారంభం అయ్యాయి, సొంతూర్లకు వచ్చి చెరువు కట్టపై సేద తీరుతున్న వారి సంఖ్య పెరుగుతున్న వేళ చెరువు కట్టపై అధికారులు చెట్టు కొమ్మలు కత్తిరించడం, గ్రిల్స్​కు రంగులు వేయిస్తున్నారు. ఇప్పటికే మిని ట్యాంక్​ బండ్​ను ముస్తాబు చేయాల్సిన అధికారులు నిద్రావస్థలో కూరుకు పోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *