Skip to main content

telanganagonthuka

Blog Post

telanganagonthuka > News > district News > కూకట్​పల్లిలో అభివృద్ధి పనులు పర్యవేక్షించిన సిఎంసి కమిషనర్​ శ్రీజన

కూకట్​పల్లిలో అభివృద్ధి పనులు పర్యవేక్షించిన సిఎంసి కమిషనర్​ శ్రీజన

కూకట్​పల్లిలో అభివృద్ధి పనులు పర్యవేక్షించిన సిఎంసి కమిషనర్​ శ్రీజన

తెలంగాణ గొంతుక:
సైబరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్​ శ్రీజన శుక్రవారం కూకట్​పల్లి జోన్​ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. కూకట్​పల్లి జోనల్​ కమిషనర్​ మయాంక్​ సింగ్ ఐపిఎస్​, డీసీ ఆంజనేయులులతో కలిసి పర్యటించారు. సర్కిల్​ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిఎంసి కమిషనర్​ శ్రీజన అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, సకాలంలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షిస్తు ఉండాలని ఆదేశించారు. 40 లక్షల వ్యయంతో చేపడుతున్న డ్రీమ్​ వీవ్​ కాలనీ పార్క్​ పనులను కమిషనర్​ పరిశీలించారు. అనంతరం 10 లక్షల వ్యయంతో చేపడుతున్న విశ్వాంభర పార్కు అభవృద్ది పనులను పర్యవేక్షించారు. అదే విధంగా పార్కులలో ఏర్పాటు చేస్తున్న ఓపెన్​ జిమ్​ నిర్వహణ చూడాలని అదేశించారు. అనంతరం 40 లక్షల వ్యయంతో చేపడుతున్న వివేక్​ నగర్​ స్మశాన వాటిక పనులను పరిశీలించారు. కేపీహెచ్​బీ 5వ ఫేజ్​లో 70 లక్షల వ్యయంతో చేపడుతున్న సెంటర్​ మీడీయన్​ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టౌన్​ ప్లానింగ్​ ఏసీపి వెంకటరమణ, డీఈ డి. రమేష్, డీఈ స్రవంతి, డీఈ శంకర్​ గణేష్​, యూబిడి మేనేజర్​ శివజ్యోతి, ఏఈ సామాల శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *