కందనూలు కేసరి సముద్రం కట్ట ముస్తాబు
విజయదశమి వేడుకల సందర్భంగా చెరువు కట్ట సుందరీకరణ పనులు
పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సునేంద్ర కుమార్…
తెలంగాణ గొంతుక:
విజయ దశమి వేడుకల సందర్భంగా కందనూలులోని కేసరి సముద్రం కట్ట సుందరీకరణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. దసరా పండుగను పురస్కరించుకుని కందనూల్ (నాగర్ కర్నూల్) మినిట్యాంక్ బండ్‌పై చేపడుతున్న సుందరీకరణ పనులను సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్, వైస్ చైర్మన్ బాదం రమేష్‌లతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించుకునే దసరా పండుగ వేళ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు పడిగే శంకర్, మొక్కపల్లి శ్రీనివాసు, వసంతా సంతోష్, పట్టణ కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొనారు.

పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, చైర్మన్ సునేంద్ర కుమార్
