Skip to main content

telanganagonthuka

Blog Post

telanganagonthuka > News > district News > మిని ట్యాంక్​ బండ్​పై విద్యుత్​ దీపాల జిగేల్​ ఏది…?

మిని ట్యాంక్​ బండ్​పై విద్యుత్​ దీపాల జిగేల్​ ఏది…?

మిని ట్యాంక్​ బండ్​పై విద్యుత్​ దీపాల జిగేల్​ ఏది…?
విజయ దశమికి 24 గంటలు గడవక ముందే విద్యుత్​ దీపాలు బంద్​ చేశారు…
పాలకుల పర్యవేక్షణ లోపమా…? అధికారుల నిర్లక్ష్యమా…?

తెలంగా గొంతుక:
పండుగ పూట అన్ని ఏర్పాట్లు చేసాం, అంగరంగ వైభవంగా విజయ దశమి వేడుకలు నిర్వహించామంటు ప్రకటించుకునే పాలకులు దసరా వేడుకలు ముగిసి 24 గంటలు గడవక ముందే నాగర్​కర్నుల్​ మినీ ట్యాంక్​ బండ్​పై విద్యుత్​ దీపాలు బంద్​ చేశారు. పాలకుల పర్యవేక్షణ లోపమా..? అధికారుల నిర్లక్ష్యమా..? పండుగ కోసం సొంత ఊర్లకు వచ్చే పట్టణ ప్రజలతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వేలాది మంది సేద తీరేందుకు నాగర్​కర్నూల్​ పట్టణంలోని మినీ ట్యాంక్​ బండ్​కు వస్తారు. ట్యాంక్​ బండ్​పై రెండవ రోజే అధికారులు ఏర్పాటు చేసిన విద్యుత్​ దీపాలు నిలిపి వేశారు. పట్టణ పురపాలక శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కనీసం ట్యాంక్​ బండ్​పై ఏర్పట్లను పట్టించుకోవడం లేదు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఎంతో వైభవంగా నిర్వహించుకునే పండులలో బతుకమ్మ, విజయ దశమి ప్రధానంగా నిలుస్తాయి. ట్యాంక్​ బండ్​పై బతుకమ్మ కుంట ఏర్పాటు చేశారు కాని బతుకమ్మ సందర్భంగా కనీసం విద్యుత్​ దీపాలు ఏర్పాటు చేయలేదు అధికారులు.

నాగర్​ కర్నూల్​ మిని ట్యాంక్​ బండ్​ పై వెలగని అలంకార దీపాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *