అంబేద్కర్ విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన మాల మహానాడు నాయకులు
రాజ్యాంగ నిర్మాతను అవమానించిన వారిపై చర్యలకు డిమాండ్: మాల మహానాడు నాయకుడు గోపాస్ రవింద్ డిమాండ్
తెలంగాణ గొంతుక:
డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రాంలను అవమానించిన వారిపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని మాల మాహానాడు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గోపాస్ రవీందర్ మాల డిమాండ్ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం కూడలిలోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రాం విగ్రహల వద్ద కొంత మంది భారి ఫ్లెక్సిలు ఏర్పాటు చేయడంతో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వేలు ధ్వంసం అయిందని, ఫ్లెక్సి ఏర్పాటు చేసిన వారిపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు బుధవారం మాల మహానాడు జిల్లా నాయకులు సైదన్నతో కలిసి గోపాస్ రవీందర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహానేతల విగ్రహాలు కనిపించకుండా ఫ్లెక్సిలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని, విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు.

