మైసూర్ దసరా ఉత్సవాలలో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి.
కర్నాటక సిఎం డీకే. శివకుమార్ ఆహ్వానం మేరకు వేడుకలలో పాల్గొన్న తెలంగాణ సిఎం.
తెలంగాణ గొంతుక:
కర్ణాటక రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే మైసూరు దసరా ఉత్సవాలలో బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కర్నాటక ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ ఆహ్వానం మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైసూరు దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు. మైసూరు దసరా వేడుకలలో అత్యంత ముఖ్యమైన ఘట్టం జంబూ సవారిలో అందంగా అలంకరించిన ఏనుగుపై బంగారు అంబారీలో కొలువుదీరిన చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. ముందుగా మైసూరు ప్రజల ఆరాధ్య దైవమైన చాముండేశ్వరి ఆలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కన్నడ సంస్కృతిని ప్రతిబింబించే జానపద కళాకారులు, సంగీత బృందాలు, నృత్య బృందాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఈ ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కర్నాటక నాడ హబ్బ (రాష్ట్ర పండుగ) ఉత్సవాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి, కళలు, చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తాయి. ఈ కార్యక్రమంలో కేరళం ముఖ్యమంత్రి విడి. సతీషన్, దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు.
