మిని ట్యాంక్ బండ్‌పై విద్యుత్ దీపాల జిగేల్ ఏది…?
విజయ దశమికి 24 గంటలు గడవక ముందే విద్యుత్ దీపాలు బంద్ చేశారు…
పాలకుల పర్యవేక్షణ లోపమా…? అధికారుల నిర్లక్ష్యమా…?
తెలంగా గొంతుక:
పండుగ పూట అన్ని ఏర్పాట్లు చేసాం, అంగరంగ వైభవంగా విజయ దశమి వేడుకలు నిర్వహించామంటు ప్రకటించుకునే పాలకులు దసరా వేడుకలు ముగిసి 24 గంటలు గడవక ముందే నాగర్‌కర్నుల్ మినీ ట్యాంక్ బండ్‌పై విద్యుత్ దీపాలు బంద్ చేశారు. పాలకుల పర్యవేక్షణ లోపమా..? అధికారుల నిర్లక్ష్యమా..? పండుగ కోసం సొంత ఊర్లకు వచ్చే పట్టణ ప్రజలతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వేలాది మంది సేద తీరేందుకు నాగర్‌కర్నూల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్‌కు వస్తారు. ట్యాంక్ బండ్‌పై రెండవ రోజే అధికారులు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు నిలిపి వేశారు. పట్టణ పురపాలక శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కనీసం ట్యాంక్ బండ్‌పై ఏర్పట్లను పట్టించుకోవడం లేదు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఎంతో వైభవంగా నిర్వహించుకునే పండులలో బతుకమ్మ, విజయ దశమి ప్రధానంగా నిలుస్తాయి. ట్యాంక్ బండ్‌పై బతుకమ్మ కుంట ఏర్పాటు చేశారు కాని బతుకమ్మ సందర్భంగా కనీసం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయలేదు అధికారులు.
