Skip to main content

telanganagonthuka

Blog Post

telanganagonthuka > News > district News > అంబేద్కర్ విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు

అంబేద్కర్ విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు

అంబేద్కర్ విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన మాల మహానాడు నాయకులు

రాజ్యాంగ నిర్మాతను అవమానించిన వారిపై చర్యలకు డిమాండ్​: మాల మహానాడు నాయకుడు గోపాస్​ రవింద్​ డిమాండ్​

 

తెలంగాణ గొంతుక:
డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​, బాబు జగ్జీవన్​ రాంలను అవమానించిన వారిపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని మాల మాహానాడు మేడ్చల్​ జిల్లా అధ్యక్షుడు గోపాస్​ రవీందర్​ మాల డిమాండ్​ చేశారు. కుత్బుల్లాపూర్​ నియోజకవర్గం గాజుల రామారం కూడలిలోని డాక్టర్​ బీఆర్​. అంబేద్కర్, బాబు జగ్జీవన్​ రాం​ విగ్రహల వద్ద కొంత మంది భారి ఫ్లెక్సిలు ఏర్పాటు చేయడంతో బాబా సాహెబ్​ అంబేద్కర్​ విగ్రహం వేలు ధ్వంసం అయిందని, ఫ్లెక్సి ఏర్పాటు చేసిన వారిపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తు బుధవారం మాల మహానాడు జిల్లా నాయకులు సైదన్నతో కలిసి గోపాస్​ రవీందర్​ జీడిమెట్ల పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మహానేతల విగ్రహాలు కనిపించకుండా ఫ్లెక్సిలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని, విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *