కూకట్పల్లిలో అభివృద్ధి పనులు పర్యవేక్షించిన సిఎంసి కమిషనర్ శ్రీజన
తెలంగాణ గొంతుక:
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన శుక్రవారం కూకట్పల్లి జోన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. కూకట్పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ ఐపిఎస్, డీసీ ఆంజనేయులులతో కలిసి పర్యటించారు. సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిఎంసి కమిషనర్ శ్రీజన అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, సకాలంలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షిస్తు ఉండాలని ఆదేశించారు. 40 లక్షల వ్యయంతో చేపడుతున్న డ్రీమ్ వీవ్ కాలనీ పార్క్ పనులను కమిషనర్ పరిశీలించారు. అనంతరం 10 లక్షల వ్యయంతో చేపడుతున్న విశ్వాంభర పార్కు అభవృద్ది పనులను పర్యవేక్షించారు. అదే విధంగా పార్కులలో ఏర్పాటు చేస్తున్న ఓపెన్ జిమ్ నిర్వహణ చూడాలని అదేశించారు. అనంతరం 40 లక్షల వ్యయంతో చేపడుతున్న వివేక్ నగర్ స్మశాన వాటిక పనులను పరిశీలించారు. కేపీహెచ్బీ 5వ ఫేజ్లో 70 లక్షల వ్యయంతో చేపడుతున్న సెంటర్ మీడీయన్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఏసీపి వెంకటరమణ, డీఈ డి. రమేష్, డీఈ స్రవంతి, డీఈ శంకర్ గణేష్, యూబిడి మేనేజర్ శివజ్యోతి, ఏఈ సామాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
