Skip to main content

telanganagonthuka

Blog Post

telanganagonthuka > News > district News > కందనూలు కేసరి సముద్రం కట్ట ముస్తాబు

కందనూలు కేసరి సముద్రం కట్ట ముస్తాబు

కందనూలు  కేసరి  సముద్రం కట్ట ముస్తాబు

విజయదశమి వేడుకల సందర్భంగా చెరువు కట్ట సుందరీకరణ పనులు

పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాజేష్​ రెడ్డి, మున్సిపల్​ చైర్మన్​ సునేంద్ర కుమార్​…

తెలంగాణ గొంతుక:
విజయ దశమి వేడుకల సందర్భంగా కందనూలులోని కేసరి సముద్రం కట్ట సుందరీకరణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. దసరా పండుగను పురస్కరించుకుని కందనూల్​ (నాగర్​ కర్నూల్​) మినిట్యాంక్​ బండ్​పై చేపడుతున్న సుందరీకరణ పనులను సోమవారం ఎమ్మెల్యే డాక్టర్​ కూచుకుళ్ల రాజేష్​ రెడ్డి, మున్సిపల్​ చైర్మన్​ తీగల సునేంద్ర కుమార్​, వైస్​ చైర్మన్​ బాదం రమేష్​లతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే రాజేష్​ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించుకునే దసరా పండుగ వేళ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని మున్సిపల్​ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్​లు పడిగే శంకర్, మొక్కపల్లి శ్రీనివాసు, వసంతా సంతోష్, పట్టణ కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొనారు.

పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రాజేష్​ రెడ్డి, చైర్మన్​ సునేంద్ర కుమార్​

Leave a comment

Your email address will not be published. Required fields are marked *