ప్రజాస్వామ్యంలో మార్పు విద్యావంతుల భాగస్వామ్యంతోనే సాధ్యం : నర్వ పవన్
కేపీహెచ్ బి కాలనీ మలేషియన్ టౌన్‌షిప్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లలో అర్హులైన పట్టభద్రుల కోసం మంగళ వారం ప్రత్యేక ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక బిజెపి నాయకులు నర్వ పవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కమ్యూనిటీ అపార్ట్ మెంట్ లలో ఉన్న అర్హులైన పట్టభద్రుల ఓటర్లు నుండి విశేష స్పందన లభించింది. పట్టభద్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా నర్వ పవన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మార్పు రావాలంటే చురుకైన విద్యావంతుల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందన్నారు. యువత ముందుకు వచ్చి దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించే
శక్తి నేటి యువత లోనే ఉందన్నారు.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమానికి సహకరించిన పట్టభద్రులకు, కమ్యూనిటీ సభ్యులకు ఆయన ఈ సందర్భంగా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
