Skip to main content

telanganagonthuka

Blog Post

telanganagonthuka > News > district News > రోడ్డు ఆక్రమణలను తొలగించిన అధికారులు

రోడ్డు ఆక్రమణలను తొలగించిన అధికారులు

ఫుట్​ పాత్​ ఆక్రమించి ఏర్పాటు చేసిన షెడ్డులు, నిర్మాణాలను కూల్చిన టౌన్​ప్లానింగ్​ సిబ్బంది.

తెలంగాణ గొంతుక:
రోడ్డును, ఫుట్​ పాత్​లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారినై సిఎంసి టౌన్​ప్లానింగ్​ అధికారులు ఉక్కపాదం మోపుతున్నారు. రోడ్డు పక్కన ఫుట్​ పాత్​లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారని వరుస వస్తున్న ఫిర్యాదులతో పాటు, ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల దృష్ట్యా అధికారులు రోడ్డు ఆక్రమణల తొలగింపు కోసం ప్రతి వారం స్పెషల్​ డ్రైవ్​ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కూకట్​పల్లి జోన్​ పరిధిలో టౌన్​ ప్లానింగ్​ అధికారులు శుక్రవారం రోడ్డు ఆక్రమణలను తొలగించారు. కూకట్​పల్లి సర్కిల్​ పరిధిలోని కేపీహెచ్​బీకాలనీ రమ్య గ్రౌండ్​ సమీపంలో రోడ్డు ఆక్రమించి ఏర్పాటు చేసిన షెడ్డులను, దుకాణాలను టౌన్​ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ నేతృత్వంలో సిబ్బంది తొలగించారు. అదే విధంగా ఆల్విన్​ కాలనీ సర్కిల్​ పరిధిలోని ఎల్లమ్మబండ కాలనీలో రోడ్డు పొడవున ఫుట్​ పాత్​ను ఆక్రమించి ఏర్పాటు చేసిన రేకుల షెడ్​లను టౌన్​ప్లానింగ్​ టీపిఎస్​ మచ్చేందర్​ ఆధ్వర్యంలో సిబ్బంది తొలగించారు.

రమ్య గ్రౌండ్​ వద్ద రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న అధికారులు.

రమ్య గ్రౌండ్​ వద్ద రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న అధికారులు.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *