ఫ్యూచర్ సిటి పోలీస్ కమిషనరేట్‌ను ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ గొంతుక:
హైదరాబాద్ నగర శివారును కలుపుతు కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటి పోలీస్ కమిషనరేట్‌ను సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ జోషీ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

