కన్నుల విందుగా సద్దుల బతుకమ్మ
కూకట్పల్లిలో భారి బతుకమ్మల ఊరేగింపు…


తెలంగాణ గొంతుక:
కూకట్పల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సద్దుల బతుకమ్మ నాడు కూకట్పల్లి గ్రామంలో భారి బతుకమ్మలను పేర్చి గ్రామ పురవీధులలో ఊరేగించి రంగధాముని చెరువు కట్టకు నిమజ్జనానికి తరలించారు. కూకట్పల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్బ ఉన్న బతుకమ్మ మైదానంలో బతుకమ్మ అడిన తరువాత భారి బతుకమ్మలను గ్రామ పురవీధులలో ఊరేగించారు. 5 అడుగుల నుంచి 20 అడుగుల వరకు బతుకమ్మలను తయారు చేయడం కూకట్పల్లి గ్రామంలో ఎన్నో దశాబ్దాలుగా ఆనవాయితిగా వస్తున్న పద్దతి. రంగధాముని చెరువు కట్టపై బతుకమ్మ, విజయ దశమి నిర్వహణ కమిటి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిలలు పాల్గొన్నారు.


