పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి: నర్వ పవన్
కార్మికులకు దసరా కానుకగా చీరలు పంపిణీ చేసిన పవన్…
తెలంగాణ గొంతుక:
సమాజం పట్ల పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని నర్వ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నర్వ పవన్ కుమార్ అన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని కేపీహెచ్‌బి కాలనీ 4వ ఫేజ్‌లో నర్వ పవన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సీఎంసి పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నర్వ పవన్ మాట్లాడుతూ కాలనీ పరిశుభ్రత కోసం, ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమించే పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించి, పండుగ సంతోషాన్ని వారితో కుటుంబ సభ్యులుగా భావించి పంచుకోవడమే నిజమైన దసరా అని, తమ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కామేశ్వరరావు, వెంకటరమణ యాదవ్, తోట రమేష్, యాదవ రెడ్డి, రేవతి, నాగలక్ష్మి, స్వర్ణ, హరిబాబు, నాగార్జున, మంచాల సాయి, అరుణ్, సురేంద్ర, భరత్ తదితరులు పాల్గొన్నారు.
