నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ ప్రాంగణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన
తెలంగాణ గొంతుక:
తెలంగాణ ష్యూచర్ సిటిలో నిర్మిస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) నూతన ప్రాంగణానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రాంగణం కోసం ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 20 ఎకరాల భూమి కేటాయించింది. 2009లో జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునరుద్ధరణ మిషన్ (JNNURM) కింద ఎంపికైనప్పటికీ ఎన్ఐయూఎంకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించని కారణంగా ఇంతకాలం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 20 ఎకరాలు కేటాయించింది. తెలంగాణలో పట్టణ విధానాల రూపకల్పనకు, కార్యాచరణ ఆధారిత పరిశోధన సంస్థగా ఎన్ఐయూఎం కీలకంగా పనిచేస్తుందని సిఎం రేవంత్ రెడ్డి ఉధ్ఘాటించారు. 2028 జూన్ 2 నాటికి ప్రాంగణ నిర్మాణాన్ని పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతకు ముందు సిఎం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) భవనాల నిర్మాణాలు, పరిసర ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
