ప్రజా సమస్యల పరిష్కారినికి తక్షణమే చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.
తెలంగాణ గొంతుక:
ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని వసంత్‌నగర్ డివిజన్ పరిధి ఎన్ఆర్ఎస్ఏ కాలనీ, 9వ ఫేజ్ కాలనీలలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం అధికారులతో కలిసి పర్యటించారు. ఎన్ఆర్ఎస్ఏ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ఉన్నాయని కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చాచరు. కాలనీ వాసుల వినతిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా వసంత్ నగర్ కాలనీలోని షటిల్ కోర్టు మరమ్మతు పనులను పూర్తి చేయాలని సూచించారు. షటిల్ కోర్టు ప్రజలు వినియోగించుకునే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్ రావు, ఏఈ శ్రీనివాస్, కాలనీ నాయకులు నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
