హౌసింగ్ బోర్డు స్థలాలు లీజు ముగిసిన ఖాళీ చేయడం లేదు
కేపీహెచ్బీకాలనీలో హౌసింగ్ బోర్డుకు సంబంధించిన స్థలాన్ని అద్దె రూపంలో తీసుకున్న కొంత మంది లీజు గడువు ముగిసిన ఖాళీ చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోరం మాల్ ఎదురుగా ఉన్న హౌసింగ్ బోర్డు ఖాళీ స్థలాన్ని ఓ వ్యక్తి సెప్టెంబర్ 20వ తేది వరకు లీజు పద్దతిన తీసుకుని అందులో పండ్లు విక్రయించేందుకు స్టాల్ ఏర్పాటు చేశాడు. లీజు ముగిసిన సదరు స్థలాన్ని ఖాళీ చేయకుండా బ్రాండ్ సేల్ పేరుతో మరో వ్యాపారం కోసం సదరు స్థలాన్ని వినియోగిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హౌసింగ్ బోర్డు అధికారులు స్పందించి లీజు ముగిసిన కొనసాగుతున్న స్టాల్ను ఖాళీ చేయించాలని పలువురు కోరుతున్నారు.
