సమస్యల పరిష్కారం కోసం కూకట్ పల్లిలో ఆందోళన చేపట్టిన జర్నలిస్టులు.
మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన జర్నలిస్టులు
ప్రభుత్వాలు మారుతున్న ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ఉంటున్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు ఆరాయించారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కేపిహెచ్బి కాలనీ రోడ్డు నంబర్ 1లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గాంధీ జయంతి సందర్భంగా జర్నలిస్టులు శాంతియుత ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎంఏ. కరీమ్, ప్రధాన కార్యదర్శి ఎడ్ల రంజిత్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనకు కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జర్నలిస్టులు గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ళు గడుస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన మూడేళ్ల కాలంలో జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం చర్యలు తీసుకోకపోవడం అత్యంత ఆందోళన కలిగిస్తుందన్నారు. జర్నలిస్టు కుటుంబాల ఆరోగ్య భద్రత కోసం జర్నలిస్టులు ఆందోళన బాట పట్టక తప్పని పరిస్థితి నెలకొన్నదని అన్నారు. ఇల్లు, ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి నోచు కోవడం లేదని ఆరోపించారు. వేతన బోర్డు, జర్నలిస్టుల రక్షణ చట్టాలను ఏర్పాటు చేయాలన్న తదితర డిమాండ్లతో ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు.

అనంతరం కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎంఏ. కరీమ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్న జర్నలిస్టుల ఇల్లు, ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆరోపించారు. జర్నలిస్టు కుటుంబాల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు నీటిమీద రాతలు గానే మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించక తప్పడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తోట్ల పరమేశ్, నవీన్ రెడ్డి, గంగరాజు, హరిబాబు, శశిధర్, మాణిక్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, గింజుపల్లి వేణు మాధవ్, జయకుమార్, కావూరి ప్రవీణ్, సముద్రాలు కిరణ్, రాము సామల, విద్యాసాగర్ రెడ్డి, బంటు ప్రవీణ్, హరికృష్ణ, చాటమొని రాము, మారుతి సాగర్, రాజు, రాకేష్, భాస్కర్, ఆనంద్, పంతం వెంకటేష్, రాజు, శ్రావణ్, అనిల్ యాదవ్, రామ్ రెడ్డి, ఉపేందర్, చంద్రకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్: 2కేపీ1,2లలో… మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహిస్తున్న కూకట్ పల్లి జర్నలిస్టులు.
raja 4 Oct 2026
great